ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం దేవస్దానంలో 25 మంది స్థానిక ఉద్యోగుల అంతర్గత బదిలీలు

Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో స్థానిక అంతర్గత బదిలీలు నిర్వహించారు. బదిలీలో డిప్యూటీ ఈవో, అసిస్టెంట్ కమిషనర్, శాశ్వత ఉద్యోగుల, ఒప్పంద ఉద్యోగులు, మొత్తం 25 మంది ఉద్యోగులను స్థానికంగా అంతర్గత బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు నిర్వహించామని ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు.
అయితే డిప్యూటీ ఈవో, అసిస్టెంట్ కమిషనర్, పర్యవేక్షణాధికారి స్థాయి నుండి ఒప్పంద ఉద్యోగి వరకు బదిలీలు చేశారు. బదిలీ అయినవారు ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుండి నూతనంగా కేటాయించిన విధులకు వెంటనే హాజరు కావాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వుల్లో తెలిపారు.