తెలంగాణ
Summer Effect: తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఎండల తీవ్రత

Summer Effect: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆది, సోమ, మంగళవారాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
ఇప్పటికే భద్రాచలం, ఆదిలాబాద్, మెదక్, రామగుండంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం పడిపోవడం వల్ల వేడి తీవ్రత ఎక్కువైందని వివరించింది.