ఆంధ్ర ప్రదేశ్

వృద్ధుడి ప్రాణం తీసిన ఇన్సూరెన్స్‌ నగదు

ఇన్సూరెన్స్‌ నగదు ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కూతురు ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా నగరి పరిధిలోని ఎం.కొత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడన్న కోపం, ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో ఇద్దరు వ్యక్తులు 65 ఏళ్ల గుణశీలన్‌ను కిరాతకంగా చంపి ముక్కలుగా చేసి చెరువులోకి విసిరేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయ్యప్పన్, గంగాధరం అనే వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీంతో మృతదేహం కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button