అంతర్జాతీయం

South Africa: కుప్పకూలిన అహోబిలం ఆలయం.. భారతీయుడి సహా, మరో ముగ్గురు మృతి!

South Africa: దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్వాజులు నాటల్‌ ప్రావిన్స్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల అహోబిలం ఆలయం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అక్కడ పనులు చేస్తున్న భారత సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తితో పాటు మరో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన కార్మికులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది ఉండవచ్చని అధికారులు అనుమానిస్తుండటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button