క్రీడలు
హైదరాబాద్‌లో భారత క్రికెటర్ తిలక్ వర్మ సందడి

హైదరాబాద్‌లో భారత క్రికెటర్ తిలక్ వర్మ సందడి చేశారు. చందానగర్‌లోని లేగల స్పోర్ట్స్ అకాడమీని క్రికెటర్ తిలక్ వర్మ సందర్శించారు. తిలక్ వర్మను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆసియా కప్ గెలుపొందడం ఎనలేని సంతోషాన్నిచ్చిందని క్రికెటర్ తిలక్ వర్మ తెలిపారు.
పాక్ క్రికెటర్లు నాపై ఒత్తిడి పెంచాలని చూశారన్నారు. పాక్ ఆటగాళ్లు నన్ను రెచ్చగొట్టేందుకు యత్నించారని అన్నారు. కానీ నా కళ్ల ముందు దేశమే కనిపించిందన్నారు. నేను ఆడిన ఇన్నింగ్స్‌లో ఇదే బెస్ట్ ఇన్నింగ్స్ అని అన్నారు.



