Bhargavastra: భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించిన భారత్

Bhargavastra: ఇది కదా భారత్ అంటే. ఇది కదా భారతీయులు కోరుకుంటుంది. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ ఆరంభిస్తుంటే ఏంటో ఏందో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇండియా సత్తా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. కేవలం ఇజ్రాయెల్, రష్యా సహకారం కాదు, సొంతంగా ఇండియా ఇప్పుడు రూపొందిస్తున్న టెక్నాలజీ ఇండియాను ప్రపంచ సూపర్ పవర్ గా మార్చేస్తోంది.
తక్కువ-ధరలో కౌంటర్ డ్రోన్ వ్యవస్థ సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్‌ను ఇండియా రూపొందించి అభివృద్ధి చేసింది. ఇది డ్రోన్ సమూహాల ముప్పును ఎదుర్కోవడంలో తురుమని చెప్పాల్సి ఉంటుంది. ఈ కౌంటర్-డ్రోన్ వ్యవస్థలో ఉపయోగించిన మైక్రో రాకెట్లు గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో కఠినమైన పరీక్షలను ఎదుర్కొని సత్తా చాటాయి.
నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంతో ఇప్పుడు యుద్ధక్షేత్రంలో ఇండియా పైచేయి సాధించేలా చేస్తున్నాయి. మే 13న ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సీనియర్ అధికారుల సమక్షంలో గోపాల్‌పూర్‌లో రాకెట్ కోసం మూడు పరీక్షలు నిర్వహించారు. ఒక్కొక్క రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా రెండు పరీక్షలు నిర్వహించారు. రెండు సెకన్లలోనే, రెండు రాకెట్లను ప్రయోగించడం ద్వారా పరీక్ష నిర్వహించారు. నాలుగు రాకెట్లు ఊహించిన విధంగా వర్కౌటయ్యాయి. పెద్ద ఎత్తున డ్రోన్ దాడులను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తోంది.
భార్గవాస్త్ర 2.5 కి.మీ దూరంలో ఉన్న చిన్న, ఇన్కమింగ్ డ్రోన్లను గుర్తించి న్యూట్రలైజ్ చేయడానికి అధునాతన సామర్థ్యాలను కలిగి ఉంది. ఇది 20 మీటర్లకు చేరువవుతున్న సమయంలోనూ డ్రోన్ సమూహాలను జీరో చేస్తుంది. మొత్తంగా మొదటి రక్షణ పొరగా గైడెడ్ మైక్రో రాకెట్లను ఉపయోగిస్తుంది. ప్రభావవంతంగా, తటస్థీకరించేందుకు కచ్చితత్వం కోసం రెండో పొరగా గైడెడ్ మైక్రో-క్షిపణిని ఇప్పటికే పరీక్షించారు.
సముద్ర మట్టానికి 5 వేల మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలతో సహా విభిన్న భూభాగాలలో సజావుగా మోహరించడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. సాయుధ దళాల ప్రత్యేక కార్యాచరణ డిమాండ్లను భార్గవాస్త్రం పరిష్కరిస్తుంది. భార్గవస్త్రం అత్యంత తక్కువ ధరకు రూపొందించడం వల్ల ఇది తక్షణం అందుబాటులోకి రానుంది.
ప్రత్యర్థులు ఉపయోగించి UAVలను నిర్వీర్యం చేయడానికి అంకితమైన రాకెట్, మైక్రో-క్షిపణుల అభివృద్ధిని చాటింది. రాడార్, ఇతర భాగాలను వినియోగదారు అవసరానికి అనుగుణంగా దీన్ని మార్చుకునే వీలుంది. లేయర్డ్, టైర్డ్ AD ఎయిర్ డిఫెన్స్ కవర్ కోసం ఇంటిగ్రేటెడ్ పద్ధతిలో పనిచేసేలా చేయవచ్చు. దీని ద్వారా, సుదూర శ్రేణులలో లక్ష్యాలను చేజ్ చేయడానికి అవకాశం కలుగుతుంది.
ఈ వ్యవస్థ ఇప్పటికే ఉన్న నెట్వర్క్-కేంద్రీకృత యుద్ధ మౌలిక సదుపాయాలతో సజావుగా ఏకీకరణ కోసం కూడా రూపొందించారు. ఈ వ్యవస్థ రాడార్ 6 నుండి 10 కి.మీ దూరంలో ఉన్న సూక్ష్మ వైమానిక ముప్పులను గుర్తించగలదు. సెన్సార్ సూట్ తక్కువ రాడార్ క్రాస్-సెక్షన్ లక్ష్యాలను కచ్చితంగా గుర్తించి, నిర్ధారిస్తుంది. మేక్ ఇన్ ఇండియా విధానానికి భార్గవాస్త్రం మరో ముందడుగు.