జాతియం
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్’లో 100 మంది ఉగ్రవాదులు హతం

Operation Sindoor: పహల్‌గామ్ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో ఏకంగా 100మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఉదయం 10గంటలకు మీడియా సమావేశంలో భద్రతా దళాలు వెల్లడించనున్నాయి. పక్కా సమాచారంతో ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించారు. 9 ఉగ్ర స్థావరాలపై ఈ డ్రోన్లు విరుచుకుపడ్డాయి.
ముఖ్యంగా పీవోకే క్యాంపుల్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి చేసింది. ఇక పుల్వామా ఉగ్రదాడికి విషయానికొస్తే.. పాక్ పంజాబ్‌లోని మర్కాజ్ సుభాన్ అల్లాపై కూడా దాడి చేసింది. పుల్వామా దాడికి జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ మార్కాజ్ నుండే ప్రణాళిక రచించినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి.



