India-China: భారత్-చైనాలు స్నేహగీతిక

India-China: అంతర్జాతీయ శాశ్వత శత్రువులు-శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు.దీర్ఘకాలిక ప్రయోజనాలే ఉంటాయి. గత కొంత కాలంలో కత్తులు దూసుకున్న ఇరు దేశాలు ప్రసుత్తం స్నేహగీతాన్ని ఆలపిస్తున్నాయి. పాత పంచాయితీలకు స్వస్తి పలికి స్వప్రయోజనాల కోసం కొత్త బంధంలోకి అడుగు పెట్టాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. శత్రులు మారిన ఆ దేశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగా మిత్రులుగా మారారు. ఇంతకీ ఏవీ
ఆసియా భౌగోళిక రాజకీయాల్లో ఆశ్చర్యకరమైన మలుపును తెచ్చాయి. భారత్, చైనా ఇప్పుడు సహకారం వైపు చేతులు కలుపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రగన్ పై భారీ సుంకాలు విధిస్తూ వాణిజ్య యుద్ధం ప్రకటించింది. దీంతో భారత్‌తో స్నేహ హస్తం కోసం చైనా చేతులు చాచింది. అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల దెబ్బ భారత్-చైనాను దగ్గరకు చేరుస్తోంది.
భారత్, చైనా మైత్రీబంధం బలపడటం వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలకు దర్ప ణం పట్టింది. చైనాలోని తియాన్‌జిన్ వేదికగా భారత్-చైనాలు స్నేహగీతిక వినిపిస్తున్నాయి. సరిహద్దు వివాదాలను పక్కనపెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
వాణిజ్య ఆంక్షలతో భారత్, చైనా రెండింటినీ లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, ట్రంప్ అనుకోకుండా రెండు ఆసియా శక్తులకు ఉమ్మడి మైదానాన్ని సృష్టించాడు. అమెరికా ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా భారత్-చైనాను దగ్గర చేశాడు. భారతదేశానికి, శాంతియుత పొరుగువారిని కలిగి ఉండటం ఎల్లప్పుడూ ఒక సవాల్‌గా ఉంటుంది.. కెనడా ,మెక్సికోతో సాపేక్షంగా స్థిరమైన సరిహద్దులను కలిగి ఉన్న యునైటెడ్ స్టేట్స్ మాదిరిగా కాకుండా, భారతదేశం పొరుగు ప్రాంతం చారిత్రాత్మకంగా అస్థిరంగా ఉంది.
గల్వాన్ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ముందుకొచ్చాయి. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు సన్నాహక భేటీలో భాగంగా భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తియాంజిన్ తీరనగరంలో ఈ సమావేశం దాదాపు 60 నిమిషాలపాటు జరిగింది.
భారత్, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాల అధినేతలు కంకణబద్దమయ్యారు. సమష్టిగా వాణిజ్యం, పెట్టుబడులను మరింతగా విస్తరించి అంతర్జాతీయ వాణిజ్య సుస్థిరతలో మన రెండు ఆర్థికవ్యవస్థలు ఎంతటి కీలకమో చాటి చెప్పాలని ఇండో-చైనా భావిస్తున్నాయి. సరిహద్దు వెంట ఉద్రిక్తత పొడచూపినా సరే ప్రస్తుతం శాంతి, సుస్థిరత కొనసాగించాలని యోచిస్తున్నాయి. సరిహద్దు వివాదాల పరిష్కారంలో మన ఇరుదేశాల ప్రతినిధి బృందాలు ఉమ్మడి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాయి
చైనాలోని తియాన్‌జిన్ వేదికగా భారత్-చైనాలు స్నేహగీతిక వినిపించాయి. సరిహద్దు వివాదాలను పక్కనపెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత ప్రధాని నరేంద్రమోడీ వద్ద ఉద్ఘాటించారు. షాంఘై సహకార సదస్సును పురస్కరించుకుని చైనాలోని తియాన్‌జిన్‌కు చేరుకున్న ఇరువురు అగ్రనేతలు చర్చలు జరిపారు. ఇరు దేశాలు మిత్రులుగా ఉండడమే సరైన ఎంపిక అవుతుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు.
సరిహద్దు వివాదాల ఆధారంగా రెండు దేశాల సంబంధాలను నిర్వచించే అవకాశం ఇవ్వకూడదని చెప్పారు. ఆర్థిక సంబంధాలు, పెట్టుబడుల్ని విస్తరించుకుంటూ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరపరిచేందుకు పాటుపడాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా పెట్టుబడులు, వాణిజ్యం పెంపొందించుకోవడంపై ఇద్దరు నేతలూ దృష్టి సారించారు.
ప్రజల మధ్య సంబంధాలు, నేరుగా విమాన సేవలు, వీసా సదుపాయాలు వంటివి చర్చకు వచ్చాయి. మోడీని మరోసారి కలవడం తనకెంతో ఆనందంగా ఉందంటూ జిన్‌పింగ్ ఆహ్వానం పలికారు. శత్రువులం కాదు అనేది దృష్టిలో పెట్టుకున్నంత కాలం ఇరు దేశాల మధ్య సంబంధాలు నిలకడగా కొనసాగుతాయని జిన్‌పింగ్ తెలిపారు. ఇరుగుపొరుగు దేశాలుగా మనం కలిసి ఉంటూ సామరస్యపూర్వక సంబంధాలు కొనసాగించుకోవాలన్నారు.
ద్వైపాక్షిక వాణిజ్యం మొదలు పెట్టుబడులు, వాణిజ్య లోటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై మోడీ, జిన్‌పింగ్ చర్చలు జరిపారు. భేటీ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలోపేర్కొంది. భారత్, చైనాలు రెండూ అభివృద్ధి భాగస్వాములేనని మోడీ, జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. విబేధాలు వివాదాలుగా మారొద్దని ఇరునేతలు అభిలషించారు. నేరుగా విమాన సర్వీసులు మొదలు వీసా జారీ వంటి ఇతరత్రా సదుపాయాల ద్వారా ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధబాంధ్యవాల పెంపును ఇరునేతలు ఆశిస్తున్నారు.
భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తవుతోంది. వ్యూహాత్మక, దీర్ఘకాల దృక్కోణంలో మనం ద్వైపాక్షిక బంధాలను సమీక్షించుకోవాలి. అప్పుడే అవి నిలకడగా పురోగమిస్తాయి. వర్ధమాన దేశాలుగా మానవ సమాజాభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఇరు దేశాలకు ఉంది. ఆసియాలో, యావత్ ప్రపంచంలో శాంతి-సుసంపన్నతలకు మనవంతు చేయూత అందించాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. వందేళ్లకోసారి వచ్చే సమూల రూపాంతరీకరణను ఇప్పుడు ప్రపంచం చూస్తోంది.
పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వాలపై ఆధారపడి సరిహద్దులో శాంతి-సామరస్యతలను కాపాడుకునేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని మోడీ భరోసా ఇచ్చారు. భారత్-చైనా సంబంధాలు అభివృద్ధి చెందుతూనే ఉండాలంటే ఇవి ఎంతో ముఖ్యమన్నారు. లోటును భర్తీ చేసుకునేలా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలని ఇరువురు నిర్ణయించారు.
ఉగ్రవాద నిర్మూలన సహా ప్రపంచవ్యాప్త అంశాలపై సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, బహుళపాక్షిక వేదికలపై సహేతుక వాణిజ్యం విషయంలోనూ ఒకరికొకరు చేయూతగా నిలవాలని తీర్మానించారు. మూడోదేశం కోణం నుంచి తమతమ బంధాలను చూడకూడదని మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
భారత్ ఆధ్వర్యంలో 2026లో జరిగే బ్రిక్స్ సదస్సుకు హాజరుకావాలని జిన్‌పింగ్‌ను మోడీ కోరారు. ఎస్‌సీవోకు చైనా నేతృత్వానికి మద్దతు పలికారు. బ్రిక్స్‌కు భారత్ సారథ్యం వహించడానికి తాము మద్దతు ఇస్తామని జిన్‌పింగ్ చెప్పారు. సుమారు 60 నిమిషాల పాటు వీరిద్దరు చర్చించుకున్నారు. చర్చలు ఫలప్రదంగా జరిగాయని మోడీ ప్రకటించారు.
మోడీ, జిన్‌పింగ్ కరచాలనం ట్రంప్‌కు కంటగింపుగా మారింది. ఇరుగుపొరుగు వైరిదేశాలు టారిఫ్‌ల మోత కారణంగా మళ్లీ సత్సంబంధాల దిశగా అడుగులేస్తూ సుంకాల సుత్తితో మోదినంత మాత్రాన అంతా అయిపోలేదని పరోక్ష హెచ్చరికలు చేశాయి.



