క్రీడలు

IND vs PAK U19 Asia Cup: మరోసారి మెగా ఫైనల్‌లో భారత్-పాక్

IND vs PAK U19 Asia Cup: మరోసారి మెగా ఫైనల్లో భారత్‌- పాకిస్తాన్‌ తలపడనున్నాయి. ఏసీసీ మెన్స్‌ ఆసియా కప్‌-2025 టోర్నీ టైటిల్‌ పోరులో దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అండర్-19 ఆసియా కప్‌‌‌‌లో అద్భుత ఆటతో అదరగొడుతున్న యంగ్ ఇండియా ఫైనల్ పోరుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా తుది పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌‌‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఇప్పటికే గ్రూప్ దశలో పాక్‌‌‌‌పై 90 రన్స్ తేడాతో ఘన విజయం సాధించిన ఆయుష్ మాత్రే కెప్టెన్సీలోని ఇండియా ఫైనల్లోనూ ఆ టీమ్‌‌‌‌ను పడగొట్టి రికార్డు స్థాయిలో 12వ సారి ఆసియా కప్ గెలుచుకోవాలని భావిస్తోంది. ఈ టోర్నీలో అజేయంగా దూసుకుపోతున్న ఇండియా.

ఈ టోర్నీలో ఇండియా బ్యాటింగ్ విభాగం భీకర ఫామ్‌‌‌‌లో ఉంది, ఇప్పటికే రెండుసార్లు 400 ప్లస్‌‌‌‌ స్కోర్లు సాధించి ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. యూఏఈపై వైభవ్ సూర్యవంశీ 171 పరుగులు, మలేసియాపై అభిజ్ఞాన్ కుండు 209 పరుగులు చేసి భారీ స్కోర్లతో రికార్డులు సృష్టించారు. కుండు యూత్ వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఇండియన్‌‌‌‌గా రికార్డుకెక్కాడు.

వీరికి తోడుగా హైదరాబాద్ కుర్రాడు ఆరోన్ జార్జ్ వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో మిడిల్ ఆర్డర్‌‌‌‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. బౌలింగ్‌‌‌‌లో పేసర్ దీపేశ్ దేవేంద్రన్ 11 వికెట్లతో సత్తా చాటుతుండగా, ఆల్ రౌండర్ కనిష్క్ చౌహాన్ అటు బ్యాట్‌‌‌‌తో పాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

ఫర్హాన్ యూసఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు ప్రధానంగా బౌలింగ్ విభాగంపైనే ఆధారపడింది. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడైన అబ్దుల్ సుభాన్ ఇండియా బ్యాటర్లకు సవాల్ విసరనున్నాడు. బ్యాటింగ్‌‌‌‌లో సమీర్ మిన్హాస్ ఆ జట్టుకు కీలకం కానున్నాడు. అయితే బ్యాటింగ్ వైఫల్యాలు, నిలకడ లేమి పాక్ జట్టును వెంటాడుతున్నాయి.

2012లో ఒకేసారి అండర్‌‌‌‌‌‌‌‌–19 ఆసియా చాంపియన్‌‌‌‌గా నిలిచిన పాక్‌‌‌‌ మరో రెండుసార్లు రన్నరప్‌‌‌‌గా (2014, 2017) నిలిచింది. ఈసారి ఎలాగైనా మరో కప్ కొట్టాలని ఆ జట్టు భావిస్తుండగా .. లీగ్ దశలో పాక్‌‌‌‌పై సాధించిన ఆధిపత్యాన్ని ఫైనల్‌‌‌‌లోనూ పునరావృతం చేసి ఆసియా కప్‌‌‌‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button