తెలంగాణ
Diarrhea: పెరుగుతున్న డయేరియా కేసులు

Diarrhea: వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్రంలో జ్వరాల తీవ్రత పెరిగింది. నిత్యం వందలాది రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సర్కార్ దవాఖానాల్లో వార్డులు కిటకిటలాడుతున్నాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగీ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విషజ్వరాల తీవ్రత పెరిగింది. ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.
భిన్నమైన వాతావరణ పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా రోగాలు గుప్పుమంటున్నాయి. అప్పుడప్పుడూ వర్షాలు పడటం సహా మబ్బు పట్టడం వ్యాధులకు అనుకూల పరిస్థితులుంటున్నాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రోజువారి అవుట్ పేషెంట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ అంటున్నారు.