టాలీవుడ్
Sukumar: పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ దాడులు

Sukumar: ఆదాయపన్ను శాఖ అధికారులు సినీ పరిశ్రమను టార్గెట్ చేశారు. ఇటీవలి కాలంలో విడుదలైన చిత్రాల నిర్మాతలు, దర్శకుల ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు పుష్ప 2 దర్శకుడు సుకుమార్ నివాసంలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి సుకుమార్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లారు.
అతనికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి వారు ఆరా తీస్తున్నారు. ఇటీవలే ప్రముఖ నిర్మాత తెలంగాణ చలనచిత్ర సమాఖ్య అభివృద్ధి సంస్థ ఛైర్మన్ దిల్ రాజు ఇళ్లలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.