తెలంగాణ

ఆత్మలకు ఓటు హక్కు!

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలలో అధికారులు ఆత్మలకు ఓటు హక్కు కల్పించారు. కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని అనేక పంచాయతీ ఓటరు జాబితాలో చనిపోయిన ఓటర్ల పేర్లు ఉండడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని మొత్తం 12 వార్డుల్లో 80 కి పైగా చనిపోయిన వారి పేర్లు ఉన్నాయి. చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉండడంతో దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని సర్పంచ్ ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చనిపోయిన వారి ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button