Imran Khan: సొంత దేశం పాకిస్తాన్‌పై ఇమ్రాన్ ఖాన్ పంచ్‌లు

Imran Khan: ఓపెనర్‌గా పాక్ ఆర్మీ చీఫ్ రావాల్సిందే.. ఆర్మీ చీఫ్‍కు పీసీబీ చీఫ్ తోడుగా రావాలి ఇద్దరూ కలిసి ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాలి అప్పుడే ఇండియాపై పాకిస్తాన్ విజయం సాధ్యం జైల్లో ఉన్నా సెటైర్లు ఆగడం లేదు. పాకిస్తాన్ చేతగాని తనాన్ని వెల్లడించారు మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్‌లో భారత్ చేతిలో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్.. తన పార్టీ ఆదేశాన్ని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ ద్వారా ప్రజలకు చేరవేశారు. భారత్‌ను ఓడించాలంటే జనరల్ అసిమ్ మునీర్, PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇద్దరూ ఓపెనర్లుగా బ్యాటింగ్ చేయాలని అంపైర్లుగా మాజీ చీఫ్ జస్టిస్ ఖాజీ ఫయెజ్ ఇసా, పాకిస్తాన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజా ఉండాలని ఇమ్రాన్ సూచించారు. థర్డ్ అంపైర్‌గా ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ ఉండాలని కూడా ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్టు ఆమె వెల్లడించారు.
1992 వన్డే వరల్డ్ కప్ విజేత కెప్టెన్‌గా పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో నిలిచిన ఇమ్రాన్, ప్రస్తుతం క్రికెట్ పరాజయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. PCB చైర్మన్ నఖ్వీ అసమర్థత, స్వపక్షపాతంతో పాకిస్తాన్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 2024 ఫిబ్రవరి ఎన్నికల్లో ఆర్మీ చీఫ్ మునీర్, అప్పటి చీఫ్ జస్టిస్ ఇసా, ఎలక్షన్ కమిషనర్ రాజా కలిసి తన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ విజయాన్ని దొంగిలించారని, ఇమ్రాన్ పదేపదే విమర్శిస్తూ వచ్చారు.
ప్రస్తుతం అనేక కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నప్పటికీ, ఆయన రాజకీయ పంచులు, క్రికెట్ వ్యంగ్యం మాత్రం కొనసాగుతోంది. పాకిస్తాన్ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తూనే ఉన్నాయి. తాజాగా పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించి.. భారత్ ఆసియా కప్ గెలుపొందిన నేపథ్యంలో.. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



