తెలంగాణ
నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం

నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌లోనూ వర్షాలు పడనున్నాయి. నేడు, రేపు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.