తెలంగాణ
హన్మకొండ లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

హన్మకొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. కమలాపూర్ మండలం నేరేళ్లలో ఇసుక అక్రమ తవ్వకాలు పాల్పడుతున్నారు. అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గత కొద్ది రోజులుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ చేశారు.



