OG: తెలుగు రాష్ట్రాల్లో ఓజీ క్రేజ్.. థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ సందడి

OG: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీంతో ఎక్కడా చూసిని ఓజీ మానియానే కనిపిస్తోంది. పండగకు ఇంకా వారం రోజుల సమయం ఉండగా ఓజీ రిలీజ్‌తో థియేటర్స్‌లో పండగ వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఓజీ’మేనియాతో ఏపీలో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు దద్దరిల్లిపోతున్నాయి. థియేటర్ల దగ్గర పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.
థియేటర్ల దగ్గర భారీగా పవన్ కళ్యాణ్ బ్యానర్స్, కటౌట్లు వెలిసాయి. విశాఖపట్నం, కర్నూలు , కడపతోపాటు ఏపీ వ్యాప్తంగా జాతరను తలపించేలా ఓజీ మూవీ క్రేజ్ కనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఓజీ దుమ్మురేపుతోంది. కర్నూలు, కడప జిల్లాల్లో థియేటర్ల దగ్గర కేక్ కటింగ్ లతో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఓజీ టీషర్టులు, హెయిర్ బ్యాండ్లు, ప్రత్యేక రథాలతో పవన్ ఫ్యాన్స్ హంగామా చేశారు.



