జాతియం

Prashant Kishor: బిహార్‌ ఎన్నికల్లో పోటీ చేయను

Prashant Kishor: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జన సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని ప్రకటించారు. కానీ ఈ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయబోయే అందరు అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తానని. తాను మాత్రం పోటీ చేయనని పీకే స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందన్నారు.

రాఘోపుర్‌లో తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించామన్నారు. పార్టీ ప్రయోజనాల మేరకే పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ నేను పోటీలో ఉంటే పార్టీ సంస్థాగత కార్యకలాపాల నుంచి నా దృష్టి మళ్లే అవకాశం ఉందని ప్రశాంత్‌ కిశోర్‌ వివరించారు. ఇక, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్‌ పార్టీ దాదాపు 150 సీట్లలో విజయం సాధిస్తుందని పీకే విశ్వాసం వ్యక్తంచేశారు. అప్పుడు తమ పార్టీ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button