తెలంగాణ
హైదరాబాద్‌లో మరోసారి దూకుడు పెంచిన హైడ్రా

హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా దూకుడు పెంచింది. ఖైరతాబాద్ తుమ్మల బస్తీలో ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపారు. శ్రీధర్ ఫంక్షన్ హాల్ ప్రహరీ గోడను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. నాలాను కబ్జా చేసి శ్రీధర్ ఫంక్షన్ హాల్ యాజమని ప్రహరీ గోడను నిర్మించినట్లు అధికారులు తెలిపారు.