తెలంగాణ
మాంగర్ బస్తీలో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి నగరంలో ముగ్గురు గల్లంతయ్యారు. నాంపల్లి మాంగర్ బస్తీలో ఇద్దరు యువకుడు గల్లంతయ్యారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాంగర్ బస్తీలో పర్యటించారు. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదని రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్ మురికి కాలువలో కాలు జారిపడ్డ రామ నీ కాపాడేందుకు వెళ్లిన అర్జున్ కూడా నీటిలో కొట్టుకుపోయాడని రంగనాథ్ తెలిపారు.
గల్లంతైన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని వెల్లడించారు. నగరంలో చాలా నాళాలు సమస్యాత్మకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. నాలా ప్రమాదంలో గళ్లంతైన బాధిత కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం 5 లక్షలు చెల్లిస్తామని కలెక్టర్ హరిచందన తెలిపారు.



