తెలంగాణ
ఓటు హక్కు వినియోగించుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధుర నగర్ లోని శ్రీనిధి విశ్వభారతి హై స్కూల్ లోని పోలింగ్ బూత్ 132 లో కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు. యువత కూడా ఓటు వేసిన తర్వాత మిగతా పనులు చూడాలన్నారు.



