హైదరాబాద్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

ఏం చేస్తే పేరు వస్తుంది. ఏం చేస్తే ప్రపంచం అటెన్షన్ తమవైపు ఫోకస్ అవుతుందని తెలుసుకోవడం, దానికి అనుగుణంగా వ్యవహరించడం. ఇలాంటి వన్నీ కూడా ఊహించడం అంత ఈజీ కాదు. కానీ ఇలాంటి వాటిలో కొందరది అందివేసిన చేయి. తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.
హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ జనరల్ పక్కన ఉన్న కీలక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టనున్నారు. అమెరికా బయట ఇలాంటి నిర్ణయం ఇదే మొదలు. ఇలా చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడిని గౌరవించడంలో మేటిగా నిలవొచ్చన్న అభిప్రాయం ఉంది.
అయితే, పేరు పెట్టే కార్యక్రమం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌ను టెక్ హబ్‌గా మార్చడానికి దోహదపడిన ప్రపంచ వ్యాపార సాంకేతిక మార్గదర్శకులను గౌరవించే ఆలోచన కూడా ఉన్నట్టుగా కన్పిస్తోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గణనీయమైన ఉనికి ఈ ప్రాంతంలో పెట్టుబడిని గుర్తించే ఒక ప్రధాన రహదారికి గూగుల్ స్ట్రీట్ అని, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.
రావిర్యాల వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీకి అనుసంధానించే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని రాష్ట్రం నిర్ణయించారు. రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే టాటా ఇంటర్చేంజ్ అని పేరు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావవంతమైన వ్యక్తులు ప్రధాన సంస్థల పేర్లతో రోడ్లకు పేరు పెట్టడం రెండు విధాలా మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గొప్ప వ్యక్తులను ఇలా స్మరించుకోవడం సముచితమని, ప్రయాణికులకు ప్రేరణగా పనిచేస్తుందన్నారు. అదే సమయంలో హైదరాబాద్‌ను ప్రపంచ గుర్తింపు ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందన్నారు.
ఐతే ఈ విషయంపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనయర్ నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్ అని పేరు పెట్టాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లు మార్చడానికి అంత ఆసక్తిగా ఉంటే, వారు వాస్తవానికి చరిత్ర అర్థం ఉన్న దానితో ప్రారంభించవచ్చని ఆయన పోస్ట్ చేశారు. మార్కెట్లో ట్రెండ్ ఉన్నవారి పేర్లను పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తారని అన్నారు. నిజమైన ప్రజల సమస్యలను చేపట్టే ఏకైక పార్టీ బిజెపి అన్న ఆయన, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తాను మహాధర్నా నిర్వహిస్తునన్నారు. మొత్తంగా కాంగ్రెస్ సర్కారు నిర్ణయాన్ని బీజేపీ విమర్శిస్తోందని స్పష్టమవుతోంది.
ఇది కేవలం రోడ్ల పేర్లు మార్చే నిర్ణయం కాదు—హైదరాబాద్ భవిష్యత్ గుర్తింపు ఏ దిశలో సాగుతుందన్న చర్చకు నేరుగా తలుపులు తెరిచే ఘట్టమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. . అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును నగరంలోని కీలక రోడ్డుకు పెట్టే ఆలోచనతో ప్రారంభమైన ఈ నిర్ణయం, తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలు, కొత్త ఆలోచనలకు కారణమవుతోంది.
టెక్ దిగ్గజాలు, గ్లోబల్ నాయకులు, అంతర్జాతీయ సంస్థల పేర్లు నగర మ్యాప్‌పై చోటు చేసుకుంటున్న వేళ, ఇది అభివృద్ధి ప్రతీకా? లేక రాజకీయ ప్రాయోజనాల కోసం జరిగే బ్రాండ్ రీబ్రాండింగ్ మాత్రమేనా? ఈ పేర్ల యుద్ధం చివరికి హైదరాబాద్ గుర్తింపుని ప్రపంచానికి మరింత దగ్గర చేస్తుందా? లేక స్థానిక సంస్కృతి, చరిత్రలను రాజకీయ విమర్శల్లోకి తీసుకెళ్తుందా అన్నది చూడాలి.



