సినిమా
Kalpika: నటి కల్పికపై దాడి చేసిన హైదరాబాద్ ప్రిజమ్ పబ్ సిబ్బంది

Kalpika: టాలీవుడ్ నటి కల్పికపై గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ సిబ్బంది దాడి చేశారు. మొదట బర్త్ డే కేక్ విషయంలో కల్పికకు, సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారగా నటి కల్పికపై పబ్ సిబ్బంది పచ్చి బూతులతో రెచ్చిపోయారు. కల్పిక ఒక డ్రగ్గిస్ట్ అంటూ ఆమెపై దాడికి దిగారు. దీంతో పబ్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వెంటనే పబ్ యజమాన్యం, ఇతరులు కలగజేసుకుని ఇరువురిని శాంతింపజేయడంతో వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది. మరీ పబ్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై నటి కల్పిక పోలీసులకు ఫిర్యాదు చేసిందా లేదా అన్న దానిపై సమాచారం లేదు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.