తెలంగాణ

హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. 25.5 లక్షల చలాన్లు!

Hyderabad: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకుగాను హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీగా ఫైన్స్ వేస్తున్నారు. 2023తో పోల్చితే 2024 సంవత్సరంలో ట్రాఫిక్ చలాన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో వాహనదారులపై కూడా భారీగానే భారం పడనుంది.

2024 సంవత్సరం మొత్తంలో హెల్మెట్ లేకుండా నడిపినందుకు 25.5 లక్షల చలాన్లు విధించారు పోలీసులు. ఈ మేరకు ఆర్టీఐ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. అటు మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడిపిన వాళ్లపై ఫైన్స్ పడ్డాయి. అలా 2024 సంవత్సరంలో 86వేల 048 చలాన్లు విధించారు. అయితే ఆర్టీఐ లెక్కల ప్రకారం 2023 సంవత్సరంలో కంటే 2024 సంవత్సరంలోనే భారీగా ఫైన్లు పడ్డాయి.

2024లో హైదరాబాద్ వాహనదారులు విపరీతంగా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. 2023 సంవత్సరంలో 19.1 లక్షల ఫైన్ లు మాత్రమే పడ్డాయి. కానీ 2024 లో మాత్రం ఆ సంఖ్య భారీగానే పెరిగింది. అటు మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడిపినందుకుగాను 57వేల 866 చలాన్లు వేశారు పోలీసులు. అలాగే సీట్ బెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసిన కేసులు 22వేల 300గా నమోదు అయ్యాయి. రోడ్లపై రేసింగ్ చేసిన కేసులు 30 గా నమోదు అయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button