తెలంగాణ
నకిలీ నోట్ల చలామణి చేస్తున్న 8 మంది అరెస్ట్

నకిలీ నోట్లు తయారీ చేస్తూ చలామణి చేస్తున్న ఎనిమిది మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించే మిషన్లు, కాగితాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తాండూరు కేంద్రంగా నకిలీ నోట్లు తయారీ చేస్తూ ఒక అసలు నోటుకు 4 నకిలీ నోట్లు పంపిణీ చేస్తున్నారు.
కస్తూరి రమేష్ ఆయన సోదరి తాండూరులో నకిలీ నోట్లను తయారు చేస్తూ అబ్దుల్ వహీద్, మొహ్మద్ సోహైల్, ఫహాద్, ఇమ్రాన్, ఒమర్, సయ్యద్ అల్తమాష్ ముఠాగా ఏర్పడి దొంగనోట్లు సరఫరా చేస్తున్నారు. ఎనిమిది మంది ముఠాను సౌత్‌వెస్ట్ జోన్ హుమాయూన్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.



