హైదరాబాద్ మెట్రో ఫేజ్2కు రంగం సిద్ధం

తెలంగాణలో మెట్రో రైలు ఫస్ట్ ఫేజ్‌కు సంబంధించిన టేక్ ఓవర్ ప్రక్రియను వేగవంతం చేసింది సర్కార్. అదేవిధంగా మెట్రో రైలు ఫేజ్ 2కు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు సిద్ధం అయ్యింది. సెకండ్ ఫేజ్‌ను రెండు విభాగాలుగా విభజించి పనులు చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టు 69 కిలో మీటర్లు విజయవంతంగా కొనసాగుతోంది. నష్టాల్లో ఉన్నామంటూ ఎల్ అండ్ టీ అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి లేఖలు రాసింది. దీంతో మెట్రో రైల్‌పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, మరో బ్యాంకు సర్వే నిర్వహించాయి. టేక్ ఓవర్ చేయవచ్చు అని సిగ్నల్ రావడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసింది.
ఈ మొత్తం ప్రక్రియను ఈ మార్చి31 లోపు పూర్తి చేయాలని క్యాబినెట్‌లో తీర్మానం చేశారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ -ఏ అండ్ బీకి సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపించారు. 24వేల 269 కోట్లతో 2ఏ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 36 పాయిట్8 కిలోమీటర్లు చేపట్టనున్నారు.
రాయదుర్గం కోకాపేట నియోపొలిస్ వరకు11 పాయింట్ 6 కి.మీ., ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట వరకు 7పాయింట్5 కి.మీ., మియాపూర్ – పటాన్ చెరు వరకు 13 పాయింట్ 4 కి.మీ. నిర్మించనున్నారు, ఎల్బీ నగర్ – హయత్ నగర్ వరకు 7 పాయింట్1 కి.మీ. మొత్తం 76 పాయింట్ 4 కిలోమీటర్ల విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను రాష్ట్రం కేంద్రానికి పంపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్‌ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది రాష్ట్ర సర్కార్.
మెట్రో రైల్ ఫేజ్ 2బీ ప్రతిపాదన, డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. రెండోదశలోని బీప్రాజెక్టులో 3 కారిడార్లను నిర్మించబోతున్నారు. ఆర్బీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39పాయింట్6 కి.మీ,.. ఇందుకు రూ.7 వేల 168 కోట్లు ఖర్చు అని అంచనా వేసింది మెట్రో రైలు విభాగం. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24 పాయింట్ 5 కి.మీ కోసం రూ.6 వేల 946 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది.
జేబీఎస్ నుంచి శామీర్ పేట వరకు 22 కిలోమీటర్ల కోసం 5 వేల465 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది సర్కార్. మొత్తం 86 పాయింట్1 కిలోమీటర్ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2బి ప్రాజెక్టుకు మొత్తం 19 వేల579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి ప్రతిపాదించింది.
మెట్రో రైలు రెండో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లకు భూసేకరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. కేంద్రం నుంచి అనుమతులతో పాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌పై క్లారిటీ వస్తే వేగంగా మెట్రో 2ఏ దశ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రాథమికంగా ఇప్పటికే నిర్మాణానికి అనుమతులు రావడంతో వచ్చేలోపు భూసేకరణ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకోసమే 2 వేల787 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం.



