తెలంగాణ
Hyderabad: హైదరాబాద్ మీర్‌పేట్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు

Hyderabad: హైదరాబాద్ మీర్‌పేట్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుడు గురుమూర్తి ఫోన్ కాల్స్‌పై పోలీసులు వివరాలు సేకరించారు. హత్యకు ముందు హత్య తర్వాత ఎవరెవరితో మాట్లాడాడనే అనుమానంతో పోలీసులు కాల్ లిస్ట్ చెక్ చేశారు.
హత్య తర్వాత గురుమూర్తి 8 కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. స్నేహితుడికి గురుమూర్తి సంక్రాంతికి వస్తున్నాం సినిమా టికెట్స్ బుక్ చేశారు. బడంగ్‌పేట్‌లో ఉన్న సోదరికి గురుమూర్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. గురుమూర్తి స్నేహితుడిని పిలిచి మాధవి హత్యపై పోలీసులు ఆరా తీశారు.