తెలంగాణ
Hyderabad: హిట్ అండ్ రన్.. స్కూటీని ఢీకొట్టిన కారు

Hyderabad: హైదరాబాద్ మణికొండలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది . మణికొండలోని పంచవటి కాలనీలో ఘటన చోటు చేసుకుంది. పిల్లలను స్కూల్ నుంచి తీసుకురావడానికి భవానీ స్కూటీపై వెళ్లింది. రోడ్ క్రాస్ చేస్తుండగా స్పీడ్‌గా వచ్చి స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా పరారైయ్యాడు. రోడ్డుప్రమాదం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



