తెలంగాణ
Hyderabad: ప్రాణాలకు తెగించి దొంగను వెంటపడి తరిమిన బాలిక

Hyderabad: హైదరాబాద్‌లోని చింతల్లో బాలిక సాహసం చేసింది. ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకునేందుకు బాలిక యత్నించింది. తాళం వేసిన ఇంట్లో పట్ట పగలే దొంగ చోరీకి యత్నించాడు. ఫస్ట్ ఫ్లోర్లో భవానీ ఫ్యామిలీ రెంట్‌కు ఉంటుంది. కింద ఓనర్స్ ఉంటున్న ఇంట్లో చప్పుడు రావడంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి భవానీ కిందకు వచ్చింది.
ఎవరని అడుగుతూ బాలిక కిందకు వచ్చి చూసింది. బాలికను చూసి దొంగ పారిపోయేందుకు యత్నించారు. దొంగను అడ్డుకునేందుకు బాలిక ప్రయత్నించింది. భవానీ ధైర్యంగా దొంగను వెంబడించింది. భవానీ ధైర్యసాహసాలు చూసి కాలనీ వాసులు మెచ్చుకున్నారు.



