తెలంగాణ
హైదరాబాద్ టోలిచౌకి సెవెన్ టూంబ్స్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్ టోలిచౌకిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సెవెన్ టూంబ్స్ సబ్ స్టేషన్ పక్కన మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో సమీప మసీదులో ముస్లింలు ప్రార్ధనలు చేస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా విద్యుత్ నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.



