ఆంధ్ర ప్రదేశ్
Kadapa: భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

కడప జిల్లా చాపాడులో పెద్ద చీపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య సుజాతను హతమార్చి భర్త పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. అక్రమ సంబంధమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. భార్యకు అక్రమ సంబంధం వద్దని వారించినా పట్టించుకోలేదని భర్త పోలీసులకు వెల్లడించాడు. భర్త గోపాల్ వృత్తిరిత్యా ప్రైవేట్ బస్ డ్రైవర్.
భార్యపై ఆగ్రహంతో హత్యచేసిన గోపాల్ ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి అటవీప్రాంతంలో పడేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. కాగా మృతదేహాన్ని ముదిరెడ్డిపల్లె అటవీ ప్రాంతంలో గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.