ఆంధ్ర ప్రదేశ్
Kakinada: కుటుంబ కలహాలతో భార్య గొంతు కోసిన భర్త

Kakinada: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యపై కత్తితో దాడి చేశాడు ఓ భర్త. ఈ సంఘటన కాకినాడ రూరల్ మండలం తూరంగిలో చోటుచేసుకుంది. చీపురుపల్లి రాజేష్ భార్య దేవిపై కత్తితో దాడి చేసిన అనంతరం తాను పీక కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం రాజేష్ భార్య దేవి కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



