ఆంధ్ర ప్రదేశ్
Nagarkurnool: భార్యను కొట్టి చంపిన భర్త

నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త కొట్టి చంపాడు. కుటుంబ కలహాల కారణంగా భార్యపై భర్త దాడికి పాల్పడ్డాడు. భర్త హుస్సేన్ దెబ్బలకు భార్య పార్వతమ్మతీవ్రంగా గాయపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పార్వతమ్మ మృతి చెందింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.



