జాతియం
భార్యను హత్య చేసిన భర్త.. సెల్ఫీ తీసుకొని వాట్సప్ స్టేటస్

తమిళనాడు జిల్లా తిరునెల్వేలి జిల్లా దరువై ప్రాంతానికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ దంపతులు. వీరికి ఇద్దురు పిల్లలున్నారు. అభిప్రాయభేదాలతో శ్రీప్రియ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేస్తోంది. అయితే బాలమురుగన్ బంధువు ఇసక్కిరాజా అనే వ్యక్తితో శ్రీప్రియ సన్నిహితంగా ఉంటున్నట్లు బాలమురుగన్ కు తెలిసింది.
ప్రియాతో ఉన్న ఫొటోను ఇసక్కిరాజా వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడంతో ఆగ్రహానికి గురైన బాలమురుగన్ శ్రీప్రియ ఉంటున్న హాస్టల్ కి వెళ్లి ఆమెను కత్తితో నరికి చంపాడు. తర్వాత భార్య మృతదేహంతో తీసుకున్న ఫొటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బాలమురగన్ ను అదుపులోకి తీసుకున్నారు.



