తెలంగాణ
మీర్పేట్ తరహాలో మరో హత్య… భార్యను చంపి..!

మీర్పేట్ తరహాలో మరో హత్య జరిగింది. మీర్పేట్ హత్య కేసు మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను చంపి మృతదేహాన్ని చెరువులో పడేశాడు ఓ భర్త. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గాంలో ఈ ఘటన జరిగింది. భార్య స్వర్ణలతను భర్త పోతన్న చంపి చెరువులో పడేశాడు . ఆ తర్వాత భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
అనంతరం చెరువులో పోతన్న భార్య శవం లభ్యం అయింది. పోలీసుల విచారణలో తానే చంపి చెరువులో పడేసినట్లు ఒప్పుకున్నాడు భర్త. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు పోలీసులు.