జాతియం

ప్రియుడితో కారులో వెళుతున్న భార్య.. ప్రియుడి చేత భార్యకు బొట్టు పెట్టించిన భర్త

భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనో ఏమో తెలియదు కానీ కొంతమంది వివాహేతర సంబంధాల వైపు అడిక్ట్ అవుతున్నారు. దీంతో అది కాస్తా కుటుంబంలో కలతలకు దారి తీస్తోంది. ఈ గొడవల్లో ఒక్కోసారి ప్రాణాలు సైతం పోతున్న పరిస్థితి. ప్రియురాలి మోజులో పడి భర్త భార్యను చంపడం ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య ఇలాంటి వార్తలు తరచూ వింటూనే ఉన్నాం.

ఇల్లీగల్ అఫైర్స్ ఇవి ఇప్పుడు గల్లీగల్లీలోనూ వెలుగుచూస్తున్నాయి. పచ్చని సంసారంలో ఈ ఇల్లీగల్ అఫైర్స్ చిచ్చు పెడుతున్నాయి. అంతేకాదు క్షణిక సుఖం కోసం ప్రాణాల మీదకు తెస్తోంది ఈ అక్రమ సంబంధం. ఇలాంటి ఘటనలతో ఓ భర్త ముందు జాగ్రత్త పడ్డాడు.

ఓ వ్యక్తి తన భార్య ప్రియుడితో కలిసి కారులో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆ తర్వాత అతను చేసిన పని అక్కడున్న వారందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అనూహ్య ఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది.

వివరాల్లోకి వెళితే, తన భార్య వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించిన భర్త, వారిని వెంబడించాడు. ఓ చోట కారులో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని పట్టుకున్నాడు. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైనప్పటికీ, అతను వినూత్నంగా ప్రవర్తించాడు.

ముందుగా, తన భార్య నుదుటిపై ఉన్న సిందూరాన్ని స్వయంగా తుడిచివేశాడు. ఆ తర్వాత, ఆమె ప్రియుడిని పిలిచి, తన భార్య పాపిటలో మళ్లీ సిందూరం దిద్దమని ఆదేశించాడు. ఈ అనూహ్య పరిణామంతో ఆ మహిళ, ఆమె ప్రియుడు షాక్‌కు గురయ్యారు.

భర్త చేసిన ఈ పని చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొందరు భర్త చర్యను సమర్థిస్తుంటే, మరికొందరు ఇది సరికాదని అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button