ఆంధ్ర ప్రదేశ్

kakinada: ప్రియుడితో ఇంట్లో భార్య.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

kakinada: కాకినాడలో భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య భాగోతాన్ని భర్త రట్టు చేశాడు. ఇద్దరూ ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. రొయ్యలు, చెరువులు చేస్తున్న భర్త లక్ష్మణ్ రాత్రి వేళల్లో చెరువుల దగ్గరికి వెళ్లి అక్కడే పడుకుంటాడు. కాగా, లక్ష్మణ్ భార్య నాగమణి గతంలో ఒక ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసింది. ఆ క్రమంలో కాలేజీలో చదువుకునే స్టూడెంట్ మణి కంఠ అనే యువకుడితో ఆమె వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది.

రోజూ లాగే లక్ష్మణ్ చెరువుల దగ్గరికి వెళ్లాడు. అయితే అక్కడ కరెంట్ లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చాడు. తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చుస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది. దీంతో లక్ష్మణ్ డోర్‌లు మొత్తం లాక్ చేసి పోలీసులకు సమాచారమిచ్చి, చుట్టుపక్కల వాళ్ళను పిలిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకుని నాగమణి, ప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button