తెలంగాణ
పోలీసులకే సవాల్ గా మారిన వరుస చోరీలు

మహబూబాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. తాళం వేస్తే చాలు దొంగలు తమ పని కానిస్తున్నారు. వరుస చోరీలు పోలీసులకు సవాల్‌గా మారాయి. అయితే చిలుకోడు గ్రామంలో జరిగిన మూడు చోరీలు ఒకేలా ఉన్నాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తే చోరీలు అరికట్టే అవకాశముంటుందని స్థానికులు చెబుతున్నారు.
పోలీసులు చోరీలు జరిగిన స్థలాన్ని పరిశీలించడంలేదని ఆరోపణలు వస్తున్నాయి. భూ వివాదంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని, సెటిల్మెంట్లు చేసేవారికి ఎక్కువ మర్యాద ఇస్తున్నారని గ్రామస్థులు ఫైర్ అవుతున్నారు. ఘటనపై వార్త రాయాలన్నా తమ పర్మిషన్ తీసుకోవాలని డోర్నకల్ పోలీసులు తెలిపినట్లు సమాచారం.