ఆంధ్ర ప్రదేశ్
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి భారీ ఆదాయం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడచిన 16.రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.09 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది.స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపు లో స్వామివారికి 2,09,40,260 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ భద్రాజి తెలిపారు. అలాగే భక్తుల కానుకలు రూపేణా 79 గ్రాముల బంగారం 3, కేజీల 522 గ్రాముల వెండి లభించినట్లు ఈవో భద్రాజి వివరించారు.అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించింది.



