తెలంగాణ
నీట మునిగిన బైపాస్ వంతెన.. నిలిచిన రాకపోకలు

నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా భైంసా గడ్డేన్న ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. దీంతో భైంసా పట్టణంలోని బైపాస్ మార్గంలోని వివేకానంద చౌక్ నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్‌కు వెళ్లే వంతెన నీట మునిగింది.దీంతో ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. స్థానికులు, రైతులు అటు వైపు వెళ్లకుండా అధికారులు కట్టడి చర్యలు తీసుకున్నారు.



