తెలంగాణ
Kadem Project: నిండుకుండలా కడెం ప్రాజెక్టు

Kadem Project: నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు భారీ వరద నీరు ప్రాజెక్టుకు చేరుతుండటంతో అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులుగా ఉండగా ప్రస్తుత నీటి మట్టం 700.0 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు సమార్థ్యం 4.699 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి మట్టం 4.699 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 320 క్యూసెక్కులుగా ఉంది. మరోవైపు ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.



