ఆంధ్ర ప్రదేశ్
కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవడంతో టీడీపీ సంబురాలు చేసుకుంటుంది. టపాసుల మోతతో కళ్యాణదుర్గం సందడిగా మారింది. మున్సిపల్ ఛైర్మన్ తలారి రాజ్ కుమార్ను ఏపీ ప్రభుత్వం తొలగించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీకి 12 మంది కౌన్సిలర్లు ఉండగావైసీపీకి 12 మంది కౌన్సిలర్ల బలం ఉంది. ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషీయో ఓటుతో కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది.



