ఆంధ్ర ప్రదేశ్
ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమోగింది. శ్రీనివాసా గోవిందా వేంకటరమణా గోవిందా అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.
స్వామికి ప్రీతికరమైన శనివారం రోజు 10 వేల మందికి పైగా యాత్రికులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నాయి.



