ఆంధ్ర ప్రదేశ్
Eluru: ద్వారకాతిరుమల ఆలయంలో భక్తుల రద్దీ

Eluru: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణములో భక్తుల రద్దీ నెలకొంది. శేషాచల పర్వతం గోవింద నామ స్మరణతో మారుమోగింది. స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున దాదాపు 10 నుంచి 15 వేల మందికి పైగా యాత్రికులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.



