తెలంగాణ
Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టుబడింది. 40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి వద్ద 40 కిలోల గంజాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంకాక్ నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు నేరుగా విమాన సర్వీసులున్నా అనుమానం రాకుండా ఉండేందుకు ఆమె బ్యాంకాక్ నుంచి దుబాయ్ మీదుగా భారత్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.