News
హాంకాంగ్‌లో కూలిన విమానం.. ఇద్దరు మృతి

Hong Kong: దుబాయ్ నుంచి వస్తున్న కార్గో విమానం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వేపై నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలో కూలింది. ఈ ఘటనలో గ్రౌండ్ -సర్వీస్ వాహనాన్ని విమానం ఢీ కొట్టడంతో ఇద్దరు కార్మికులు మరణించారు.
టర్కిష్ క్యారియర్ ఎయిర్ ACT నడుపుతున్న ఎమిరేట్స్ స్కైకార్గో విమానం , దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన తర్వాత నార్త్ రన్‌వే ను తాకినప్పుడు ఈ ప్రమాదం జరిగింది. బోయింగ్ విమానం, ల్యాండింగ్ సమయంలో ఎడమ వైపుకు తిరిగి, రన్‌వే పక్కన ఉన్న సముద్రంలోకి కూలి కొంత భాగం మునిగిపోయింది.



