ఆంధ్ర ప్రదేశ్
Anitha: అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన హోంమంత్రి

Anitha: పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏకలవ్య బాలికల గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధితులతో ఆమె మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు.
దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోందని తెలిపారు. పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.



