తెలంగాణ
Venkataramana Reddy: ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదు

కామారెడ్డిలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కలెక్టరేట్‌కు ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి చేరుకున్నారు. షబ్బీర్ అలీకి మరోసారి సవాల్ విసిరారు. తాము తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదన్నారు. కొందరు మొరుగుతున్నారని.. వారి సంగతి తర్వాత చూస్తామని హెచ్చరించారు.



