తెలంగాణ
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత .. లాఠీ ఛార్జి, పలువురు అరెస్ట్

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టుడికి యత్నించారు రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు. ఈ క్రమంలోనే ముట్టడికి యత్నించిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఈ నేపథ్యంలోనే రైతులు, బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన పలువురిని అరెస్ట్ చేశారు. నెలరోజులుగా సోయా పంట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సోయా పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.



