ఆంధ్ర ప్రదేశ్

ప్రధాని మోదీ పర్యటనతో శ్రీశైలంలో హై అలర్ట్

ప్రధాని మోడీ ఏపీ పర్యటన సందర్భంగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ నెలకొంది. ఈ నెల 16న శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని ప్రధాని మోడీ దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్ పోలీస్ పార్టీలు అణువణువు జల్లెడ పడుతున్నాయి.

నల్లమల అడవుల్లో కూంబింగ్ చేపట్టాయి భద్రత బలగాలు. ఘాట్ రోడ్డు సమీపంలోని ప్రదేశాలను క్షుణంగా పరిశీలిస్తున్నాయి భద్రత బృందాలు. శ్రీశైలంలోని సున్నిపెంట అడవులపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు హెలికాప్టర్ దిగే ప్రదేశంలో క్షుణంగా తనిఖీ చేస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button