తెలంగాణ
ములుగు లో పొలిటికల్ హీట్

Mulugu: ములుగు జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు. దీంతో ములుగులో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇటీవల గోవింద రావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన రమేష్ సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఆయన ఇందిరమ్మ ఇంటి కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు టాక్ వినబడుతోంది. మరోవైపు అధికార పార్టీ నేతల వేధింపులే కారణమని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి.